124 ఆల్విన్ కాలనీ డివిజన్ మహంకాళి నగర్ పరిధి

Sakshitha news

124 ఆల్విన్ కాలనీ డివిజన్ మహంకాళి నగర్ పరిధిలోని నాగమ్మ కాలనీ లో మంజీరా పైప్ లైన్ లేక త్రాగునీరు సమస్య ఉందని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కి తెలియచేయగా కార్పొరేటర్ కాలనీ లో పర్యటించి, సమస్యను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ త్రాగునీరు కోసం మంజీరా పైప్ లైన్ నిర్మించే విషయాన్ని ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో మంజీరా పైప్ లైన్ సంక్షన్ చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, నరసింహులు, ప్రకాష్, సాయిలు, మన్యం, ప్రేమ్, మదన్, నారాయణ, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top