విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు .. KPHB డివిజన్ మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు వసంత్ నగర్ లో ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని.. ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని.. కేపిహెచ్బి డివిజన్లో మూడు ఎకరాల స్థలంలో ఎన్టీఆర్ పేరు మీద స్కూల్ నిర్మాణం చేపట్టామని.. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.. తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి బీసీ, ఎస్సీ వంటి కులాల వారి అభ్యున్నతికి తోడ్పడిన గొప్ప మహానుభావుడు.. గొప్ప నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి యుగ పురుషుడిగా చరిత్రలో నిలిచిన మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు…,డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు శ్యామలరాజు, వసంత్ నగర్ వాసులు ..స్థానిక ప్రజలు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు…

