మహాదేవపురంలో మహానేత వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Sakshitha news

మహాదేవపురంలో మహానేత వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  17వ వర్ధంతిని పురస్కరించుకుని 277వ డివిజన్ మహాదేవపురంలో వైఎస్సార్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ చూపిన మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరంలో కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని, వైద్య సిబ్బందితో మాట్లాడి శిబిరం నిర్వహణను పరిశీలించారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంట శివరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి , ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, మైనారిటీ అధ్యక్షులు షఫీ, అఫ్జల్, అజామ్, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు మైసిగారి శ్రీనివాస్, రాష్ట్ర మాజీ జనరల్ సెక్రటరీ రఫియా బేగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.