కోదాడ పట్టణ బంద్ ఎవరి రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం….
కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు..
సూర్యాపేట జిల్లా/ కోదాడ, ఆగస్టు 30(సాక్షిత న్యూస్)
ఎవరి ప్రయోజనాల కోసం ఈ పట్టణ బంద్ ప్రజలందరికీ తెలుసని కోదాడ పట్టణ కాంగ్రెస్ నాయకుడు రావెళ్ళ కృష్ణారావు అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంతంగా సాగిపోతున్న పట్టణ జీవనాన్ని అశాంతికి గురిచేస్తూ, ఎవరి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ బంద్ పిలుపునిచ్చారనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయని,
ఉదయం లేచింది మొదలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యే సామాన్య, మధ్యతరగతి ప్రజలను, రెక్కాడితే గానీ డొక్కాడని చిరు వ్యాపారులను ఈ బంద్ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు.రోజువారీ సంపాదనపై ఆధారపడే కుటుంబాలు వ్యాపారాలు లేక ఆర్థికంగా నష్టపోయాయని,
ఒకవైపు కోదాడ ఎమ్మెల్యే వందల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిజాయితీగా పనిచేస్తుంటే.,మరొకవైపు ఈ అభివృద్ధిని ఓర్వలేకనే బంద్ పేరిట రాజకీయం చేస్తున్నారనే పట్టణ ప్రజలకు తెలుసని, గత బిఆర్ఎస్ హయాంలో ప్రతి పదవికి, పోస్టింగ్ కి ఎంతెంత వసూలు చేసినావో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని రావెళ్ల కృష్ణారావు అన్నారు.గ్రామ పంచాయతీ సర్పంచ్లు, మున్సిపల్ పాలకవర్గం ఎలాంటి నియంతృత్వం,ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు.
ఇలాంటి ప్రశాంత వాతావరణంలో,వేగంగా అభివృద్ధి చెందుతున్న కోదాడలో బంద్ నిర్వహించి సాధారణ ప్రజలను, చిరు వ్యాపారులను విసిగించడం ఏ రకమైన రాజకీయమని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రావెళ్ల అన్నారు.స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల రవాణాను, రోజువారీ పనులను అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
