కాంగ్రెస్ దగా పాలనకు “వంటా వార్పుతో ” సెగ పుట్టించిన బిఆర్ఎస్ శ్రేణులు…
కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ వద్ద వంటా వార్పుతో నిరసన తెలిపిన బిఆర్ఎస్ శ్రేణులు….
వంటా వార్పు కార్యక్రమంతో ఉద్యమ రోజులను గుర్తుచేసిన బిఆర్ఎస్ శ్రేణులు…
ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో మహిళలు బొంద పెట్టడం ఖాయం : ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ ..
కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు బిఆర్ఎస్ శ్రేణులు చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మూడవరోజు చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలను విస్మరించడానికి నిరసిస్తూ జగద్గిరిగుట్ట లాస్ట్ బస్టాప్ వద్ద మహిళా నాయకురాల్లు “వంటా వార్పు” కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.
ఈ వంట వార్పు కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొని మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత తనాన్ని ఎండగట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
అధికారమే లక్ష్యంగా సాధ్యం కాని హామీలు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ మహిళలకు ఇచ్చిన గ్యారంటీలను విస్మరించి మహిళా లోకాన్ని మోసం చేసిందన్నారు.
మహిళలకు నెలకు రూ.2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని చెప్పి నమ్మించి మహిళలను మోసం చేశారు.
మహిళలకు ఇస్తామన్న గ్యారెంటీలను విస్మరించడమే కాక వృద్ధులకు ఇస్తామన్నా 4000/- పెన్షన్, వికలాంగులకు ఇస్తామన్న 6000/- పెన్షన్ ఏమైందని ప్రశ్నించారు.
మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో మహిళలు బొంద పెట్టడం ఖాయమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST