ఎంఈవో సలీం షరీఫ్‌కు ఎస్టీయూ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Sakshitha news

ఎంఈవో సలీం షరీఫ్‌కు ఎస్టీయూ ఆధ్వర్యంలో ఘన సన్మానం….

సాక్షిత : సూర్యపేట జిల్లా/ కోదాడ విద్యాభివృద్ధికి మరిన్ని సేవలందించాలి.ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు.
రాష్ట్ర ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించిన కోదాడ మండల విద్యాధికారి ఎండీ. సలీం షరీఫ్‌ను ఎస్టీయూ కోదాడ డివిజన్ బాధ్యులు కోదాడ బాయ్స్ హై స్కూల్ నందు శాలువా, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సలీం షరీఫ్ విద్యా రంగానికి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించాలని, కోదాడ ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరింతగా తోడ్పడాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎల్ దేవరాజ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు తేజావత్ భాస్కర్, భూక్య చందులాల్, ఎస్టియు రాష్ట్ర మహిళా నాయకురాలు ఎం వెంకటరమణ, ఎస్ టి యు జిల్లా అదరపు ప్రధాన కార్యదర్శి బి రామచంద్ర రెడ్డి, ఎస్టియు జిల్లా ఉపాధ్యక్షులు సింగిరికొండ ఉపేందర్, కోదాడ మండల అధ్యక్ష కార్యదర్శులు కే విజయసారథి, సాది సురేష్, వీరేంద్ర వర్మ, ఎలగొండ శ్రీనివాస్, నాగిరెడ్డి అంకిరెడ్డి, వెంకటాచారి, వి చంద్రశేఖర్, ముదిగొండ సురేష్, బాలాజీ, ఎస్టియు సీనియర్ నాయకులు పి వెంకటనారాయణ
తదితరులు పాల్గొన్నారు.