SAKSHITHA NEWS

నిర్మాత సూర్యనారాయణబాబు కన్నుమూత

నిర్మాత సూర్యనారాయణబాబు కన్నుమూత
ప్రముఖ సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ(74) కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఆయన పద్మావతీ ఫిలింస్ ద్వారా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 24 సినిమాలను నిర్మించారు. వాటిలో శంఖారావం, బజార్ రౌడీ, అల్లుడు దిద్దిన కాపురం, అన్నదమ్ముల సవాల్ లాంటి మూవీలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మీతులసిని వివాహం చేసుకున్నారు. 1985లో గుడివాడలో ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓడిపోయారు.


SAKSHITHA NEWS