చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన సర్పంచ్ పాలకి సురేష్

Sakshitha news

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన సర్పంచ్ పాలకి సురేష్

దొరకుంటలో నాలుగు అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్షరాభ్యాస కార్యక్రమం

సూర్యాపేట జిల్లా/కోదాడ, సాక్షిత :

దొరకుంట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలు 1, 2, 3, 4లో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పాలకి సురేష్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పాలకి సురేష్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారుల విద్యాభ్యాసానికి తొలి మెట్టుగా నిలుస్తాయని అన్నారు. బాల్యం నుంచే పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించాలని సూచించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందేలా అంగన్‌వాడీ సిబ్బంది కృషి చేయాలని కోరారు.

చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు విద్య ఎంతో కీలకమని, వారి విద్యాభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యుడు జాన్, అంగన్‌వాడీ టీచర్లు కృష్ణవేణి, నాగమణి, ఆదిలక్ష్మి, అరుణ, ఆయాలు, చిన్నారులు, తల్లిదండ్రులు, పత్తిపాక రామ్మూర్తి, నాగేంద్రబాబు, ఆరిఫ్, లింగం సైదులు తదితరులు పాల్గొన్నారు.