కోదాడ పట్టణంలో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

Sakshitha news

కోదాడ పట్టణంలో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

పది వేల మంది భక్తులకు అన్నదానం

సూర్యాపేట జిల్లా/కోదాడ, సాక్షిత :

కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర గ్రామంలో నాగుల చవితి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తమ్మరలోని నాగేంద్ర స్వామి పుట్ట వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.

ఉదయం తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుని భక్తితో పూజలు నిర్వహించారు.

అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా, కనుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

నాగుల చవితి సందర్భంగా …