రామాపురం క్రాస్ రోడ్డులో ఘనంగా నాగులచవితి వేడుకలు

Sakshitha news

రామాపురం క్రాస్ రోడ్డులో ఘనంగా నాగులచవితి వేడుకలు
6 వేల మందికి అన్నదానం

సూర్యాపేట జిల్లా/కోదాడ మండలంలోని నల్లబండగూడెంలో రామాపురం క్రాస్ రోడ్డులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి పుట్ట వద్ద నాగులచవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టలో పాలు పోసి పూజలు చేసేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. ఉత్సవాల నిర్వాహకులు వృద్ధుల కోసం ఆటో సౌకర్యం కల్పించారు. ముళ్ళపాడు సీతారామాంజనేయ భక్త బృందం వారిచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. కుల, మత బేధాలు లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. సుమారు 6 వేల మందికి అన్నదానం నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లబండగూడెం గ్రామస్తులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.