మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తులను డి-అడిక్షన్ సెంటర్ కి తరలింపు…

Sakshitha news

మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తులను డి-అడిక్షన్ సెంటర్ కి తరలింపు…

జనగామ జిల్లా :
పాలకుర్తి మండలం వల్మిడి గ్రామానికి చెందిన సొహైల్ మరియు పాలకుర్తి పట్టణ కేంద్రానికి చెందిన కౌశిక్ కి గంజా టెస్ట్ పాజిటివ్ రావడంతో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి 15రోజులు జనగాం డి-అడిక్షన్ సెంటర్ కి పంపడం జరిగిందనీ పాలకుర్తి ఎస్ఐ సృజన్ కుమార్ తెలిపారు..

ఎవరైన చెడు వ్యసనాలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చేర్యలు తీసుకుంటమన్నారు.. ఇప్పటి నుంచైనా గంజాయి అలవాటు ఉంటె వారు మానుకోవలని హెచ్చరించారు.. మత్తు పదార్థాలు సేవిస్తున్న, విక్రయిస్తున్న, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే వారి వివరాలు తెలిసిన వారు ప్రత్యక్షంగా లేదా ఫోన్ ద్వారానైనా తనను సంప్రదించవచ్చని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు..