కండక్టర్ మృతి.. ఆర్టీసీ కీలక భద్రతా మార్గదర్శకాలు

Sakshitha news

కండక్టర్ మృతి.. ఆర్టీసీ కీలక భద్రతా మార్గదర్శకాలు

మణుగూరులో కండక్టర్ ప్రవళీక విషయంలో జరిగిన విషాద ఘటనపై స్పందించిన TGSRTC రాష్ట్రవ్యాప్తంగా రవాణా భద్రతను మెరుగుపరుస్తూ కొత్త నిబంధనలు తెచ్చింది. డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే బస్సును ముందుకు కదిలించాలని, అద్దె, ఈ-బస్సుల తలుపుల పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను డిపో మేనేజర్లు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.