275వ డివిజన్ అధ్యక్షులు వరగాని వాసు జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 275వ డివిజన్ బండారి లేఔట్ డివిజన్ అధ్యక్షులు వరగాని వాసు జన్మదిన వేడుకలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, వరగాని వాసు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మైసిగారి శ్రీనివాస్, బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి రఫియా బేగమ్, నిజాంపేట్ సర్కిల్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా కడియాల, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేష్ బాబు, బిక్కన్ షా, ఆలేటి శ్రీనివాస్, కల్లోజి రవి, రామ్ చందర్ నాయక్, జితేందర్ రెడ్డి, బాల బ్రహ్మచారి, యశోద, శ్రీదేవి, లక్ష్మి, నవ్య తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక నాయకులు పాల్గొని వరగాని వాసు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
