నూతనంగా 6.70 లక్షల వ్యయంతో శాంక్షన్ అయిన మంజీరా లైన్ పనులకు శంకుస్థాపన..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధి ఎం.ఎన్. రెడ్డి నగర్ ఫేస్ -1లో రూ.6.70 లక్షల వ్యయంతో నూతనంగా HMWS వాటర్ వర్క్స్(కుత్బుల్లాపూర్ వార్డ్)ద్వారా శాంక్షన్ అయిన మంజీరా లైన్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం లో కాలనీ వాసులతో కలిసి పాల్గొని మంజీరా లైన్ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించి కాలనీలోని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, తాగునీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించి, ప్రజలకు సౌకర్యవంతమైన నీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలనీల అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగడం అవసరమని పేర్కొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు సంపత్ గౌడ్,ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్,కోశాధికారి కరుణాకర్ రెడ్డి, సహా కోశాధికారి బాపిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్షపతి గౌడ్, విజయ్,నార్లకంటి దుర్గయ్య,పెద్దింటి సాయిలు,నర్సింహ రెడ్డి,కర్నె శ్యామ్,సతీష్ చక్రవర్తి,విట్టల్,శంకర్,శ్రావణ్ బోస్,శివ కృష్ణ నాగేశ్వరరావు వెంకటేష్, శ్రీనివాస్,చిదంబర శాస్త్రి,రాజేష్,ఎల్లా గౌడ్,ప్రసాద్, వినోద్ రెడ్డి, సత్య రామ్,కాశీనాథ్,శివ,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
