దసరా నవరాత్రులు 2వ రోజు వేడుకలు

Sakshitha news

దసరా నవరాత్రులు 2వ రోజు వేడుకలు

ఆలయ ధర్మకర్త కొలన్ శ్రీనివాస్ రెడ్డి , లీడర్ కొలన్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవంతో ప్రారంభమైన విజయ దశమి మహోత్సవాలలో భాగంగా 2వ రోజు అమ్మవారు కుమారి అమ్మవారి అలంకారంలో నవ్వుతూ చిరుదరహాసంతో అనుగ్రహిస్తుంది. అమ్మవారిని దర్శించుకుంటే కన్నె పిల్లలందరికీ కూడా చక్కని భర్త లభించాలని వివాహం కానీ పురుషులకు మంచి భార్య రావాలని అమ్మవారిని వేడుకుంటే వివాహం జరుగుతుంది. మంచి కుటుంబంలోకి వెళ్తారు. కావున ఈరోజు ఆలయ ధర్మకర్త కొలన్ శ్రీనివాస్ రెడ్డి మరియు నిజాంపేట్ ప్రగతి నగర్ 276 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి (తాతిరెడ్డి) అమ్మవారిని దర్శించుకుని. అందరికీ మంచి జరగాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మౌలేశ్వర రావు, మధుసూదన్ రెడ్డి, కొలన్ లక్ష్మారెడ్డి, ఏలూరి సత్య (నాని), మేడ శ్రీనివాసరావు, సురేంద్ర కుమార్ యాదవ్, సాంబశివరావు, మహేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆదిరెడ్డి, బాలకృష్ణ, మహేష్ యాదవ్ మరియు నిజాంపేట్ పెద్దలు గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు……