పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఇప్పటివరకు జరిగిన ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి దాదాపు 20 వేల మెగావాట్లకు చేరినప్పటికీ, గృహ వినియోగదారులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ, థర్మల్ పవర్‌తో పాటు ఇతర వనరులను సమర్థంగా వినియోగిస్తూ విద్యుత్ అవసరాలను తీర్చుతున్నామని చెప్పారు.
జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని, నీటి లభ్యత తగ్గడం వల్లే ఉత్పత్తి పరిమితమవుతోందని వివరించారు. రాబోయే రోజుల్లో నీటి లభ్యతపై దృష్టి సారిస్తూ తాగునీటికి ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించాలని సూచించారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
