దేవి శరన్నవరాత్రుల సందర్భంగా
దేవి శరన్నవరాత్రుల పవిత్ర పర్వదినాలను పురస్కరించుకొని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని భూమిరెడ్డి కాలనీ, వెంకటేశ్వర నగర్ మరియు గణేష్ నగర్‌లలో కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించి మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, సమాజంలో సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబంపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకున్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
