అక్రమ కేసులతో వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసన – బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు మద్దతుగా సికింద్రాబాద్ కోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు..
బీఆర్ఎస్ నేత క్రిశాంక్ పై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేసి జైలుకు పంపాలని కుట్ర చేస్తూ, కక్షపూరితంగా వేధింపులకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విధానాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ నాయకులు సికింద్రాబాద్ కోర్టుకు చేరుకుని సంఘీభావం తెలిపారు.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ , ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కోర్టుకు చేరుకుని క్రిశాంక్ కు మద్దతుగా నిలిచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. క్రిశాంక్ కు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
