కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు …
వర్ధన్నపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వర్ధన్నపేట టౌన్ మరియు వర్ధన్నపేట మండల పరిధిలోని 22 మంది అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ. 22,02,552/- విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-….
పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలు పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఆడబిడ్డల భవిష్యత్తుకు బలమైన ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వము అందిస్తున్న సహాయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు తమ పిల్లల వివాహాలను గౌరవప్రదంగా నిర్వహించుకోవాలని సూచించారు. అర్హులైన ఒక్కరూ సంక్షేమ పథకాల నుంచి వంచితులుగా ఉండకూడదనే ఉద్దేశంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ, ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా తన వంతు పూర్తి బాధ్యతతో కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు…
ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ శ్రీ మార్నెనీ రవీందర్ రావు, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY