శాస్త్రీయ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం – ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు …
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నాణ్యమైన ప్రమాణాలతో, శాస్త్రీయ పద్ధతిలో ఇళ్లను నిర్మించుకోవాలని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు సూచించారు. రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంటి నిర్మాణ విధానంపై అవగాహన కల్పించారు. పునాది నుండి స్లాబ్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్కువ స్థలంలో గాలి–వెలుతురు సమృద్ధిగా వచ్చేలా ఉత్తమమైన హౌస్ ప్లాన్‌లను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న నిధులను దుర్వినియోగం చేయకుండా, దశలవారీగా పనులు పూర్తి చేస్తూ ప్రతి పేద కుటుంబానికి పటిష్టమైన, దీర్ఘకాలిక సొంతింటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నాగరాజు ఈ సందర్భంగా తెలిపారు…
ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY