పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు మరియు అవగాహన

Sakshitha news

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు మరియు అవగాహన

షాపూర్‌నగర్‌లో పట్టభద్రులకు అవగాహన కల్పించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

హైదరాబాద్: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో పట్టభద్రులకు ఓటరు నమోదు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావడానికి అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని కూన శ్రీశైలం గౌడ్ సూచించారు…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గెలుపు కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు..

నవంబర్ 6వ తేదీ ఓటరు నమోదు చివరి తేదీగా పేర్కొంటూ, అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు…

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ మరియు స్థానిక పట్టభద్రులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు