సర్ వల్ల ప్రజలు ఓట్లను కోల్పోతున్నారు.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్.

Sakshitha news

సర్ వల్ల ప్రజలు ఓట్లను కోల్పోతున్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్.

 కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు రెండు లక్షల 50 వేల మంది సర్ ప్రక్రియ వల్ల గతంలో ఉన్న ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఈ ప్రక్రియ గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు గందరగోళంలో పడ్డారని దీనివల్ల తమ ఓట్లు ఎక్కడ పోతాయోనని భయపడుతున్నారని కావున మీరు క్షేత్రస్థాయిలో పర్యటించి బిఎల్ఓ లకు తగిన సూచనలు ఇచ్చి ఏ ఒక్కరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని నేడు సిపిఐ నాయకత్వం జోనల్ కమిషనర్ పెంచేస్ కుమార్ గారికి వినతి పత్రం ఇచ్చి కోరడం జరిగింది.
    ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు , రాములు ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబులు పాల్గొన్నారు.