విద్యార్థులకు 500 స్టీల్ ప్లేట్లు మరియు స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేసిన కీ.శే. మునిగాల మమత కుటుంబ సభ్యులు

Sakshitha news

విద్యార్థులకు 500 స్టీల్ ప్లేట్లు మరియు స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేసిన కీ.శే. మునిగాల మమత కుటుంబ సభ్యులు

దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్ నివాసులు కీ.శే. శ్రీమతి మునిగాల మమత ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి మామ మునిగాల శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులు బౌరంపేట్ ZPHS పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు మరియు స్టీల్ వాటర్ బాటిల్స్ ను కుటుంబ సభ్యులు పంపిణీ చేశారు. విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేసే స్టీల్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. రాంరెడ్డి మునిగాల కుటుంబ సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పల్పునూరి విష్ణువర్ధన్ రెడ్డిగారు , రవీందర్ , కుటుంబసభ్యులు హరి హారన్, వైష్ణవి, సప్తగిరి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.