దశదిన కర్మలకు హాజరై నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గాంధీనగర్‌లోని ఎన్‌ఆర్ ప్యాలెస్‌లో జరిగిన కాంగ్రెస్ నాయకుడు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మంజుల్కర్ తండ్రి కీర్తిశేషులు మంజుల తిమ్మయ్య దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంజుల తిమ్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం షాపూర్ ఎం.జె. ఫంక్షన్ హాల్‌లో జరిగిన దుండిగల్‌కు చెందిన ఏలూరి శ్రీనివాస్ గౌడ్ దశదిన కర్మ కార్యక్రమానికి కూడా కూన శ్రీశైలం గౌడ్ హాజరై, వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST