గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బాచుపల్లిలో మాజీ సర్పంచ్ ఆగం పాండు ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు…

అదేవిధంగా గాజులరామారం డివిజన్ పరిధిలోని వోక్షిత్ హిల్ వ్యూ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటుచేసిన గణనాథుని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు..

అనంతరం గణేష్ మండపాల కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బాచుపల్లి మాజీ సర్పంచ్ ఆగం పాండు ముదిరాజ్, సురేందర్ రెడ్డి, ఈనాడు శ్రీనివాస్, సోమీ రెడ్డి ,భాస్కర్ గౌడ్, మహమ్మద్ కాజా తదితరులు పాల్గొన్నారు.