ప్రగతి నగర్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గ

Sakshitha news

ప్రగతి నగర్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గ ||

ప్రగతి నగర్: గణేష్ ఉత్సవాల్లో భాగంగా, శిల్ప పారడైస్ కల్చరల్ &వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవ కమిటీ ఎ.వి. రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, కోలాట బృందం సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అనంతరం హన్మంతన్న గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులను అభినందిస్తూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మద్ది నారాయణ రెడ్డి, వీరబాబు, ప్రశాంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు