ఏఎస్ఐ గాపదవీ విరమణ పొందిన వెంకటేష్ గౌడ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన……… జిల్లా ఎస్పీ సునీత రెడ్డి
సాక్షిత వనపర్తి
వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎ ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తు పదవీ విరమణ పొందుతున్న వెంకటేష్ గౌడ్ కు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి శాలువా కప్పి మేమంటో బహుకరించి ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వెంకటేష్ గౌడ్ కానిస్టేబుల్ గా విధులు చేపట్టి ఏఎస్ఐ స్థాయికి ఎదిగారని పోలీస్ శాఖలో కొత్తగా విధులు చేపట్టిన నేటి యువతకు ఆయన స్ఫూర్తిదాయకమని విధుల పట్ల నిబద్ధత ప్రజల పట్ల మానవ దృక్పథం సహోదయోగులతో స్నేహపూర్వక వైఖరి యువతరానికి ఆదర్శంగా నిలుస్తారని పదవి విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక కొత్త అధ్యాయమని ఉద్యోగ బాధ్యతలు నుంచి విముక్తి పొందిన అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఆరోగ్య ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ప్రభుత్వం నుంచి అందే జిపిఎఫ్ ఇన్సూరెన్స్ ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను సక్రమంగా వినియోగించుకోవాలని శాఖా పరంగా అందాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు బకాయిలు త్వరితగత్న అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి డిసిఆర్బి డిఎస్పి బాలాజీ నాయక్ పోలీస్ కార్యాలయం ఏవో సునంద రిజర్వు ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు శ్రీనివాస్ వనపర్తి రూరల్ ఎస్సై రిషికేష్ తదితరులు అలాగే వెంకటేష్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST