అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
ఐనవోలు మండలం నందనం FACS సొసైటీ ఫంక్షన్ హాల్లో ఐనవోలు మండలం, వర్ధన్నపేట మున్సిపాలిటీ, వర్ధన్నపేట మండలాలకు చెందిన చేయూత పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు మరియు ఇతర అర్హులైన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు ఆత్మగౌరవంతో జీవించేందుకు భరోసా కల్పించే సాధనమని అన్నారు. ప్రతి నెలా అందించే పింఛన్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల అధ్యక్షులు నకరకంటి మోహన్ గౌడ్, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ శిబారాణి రాజేందర్, వర్ధన్నపేట పాక్స్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్, మండల అధ్యక్షులు పోశాల వెంకన్న,మాజీ మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ,ఇల్లంద మార్కెట్ చైర్మెన్ నరకుడు వెంకటయ్య, జెబిఎం చైర్మెన్ జన్నపురెడ్డి రుగ్విద్ రెడ్డి,యూత్ అధ్యక్షులు భాను ప్రసాద్,డైరెక్టర్లు,సర్పంచులు, ఉపసర్పంచులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST