చైతన్యపురి ఇంద్రానగర్ రామాలయంలో అంతా రామమయం
రాములోరికి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర బిఆర్ఎస్ యూత్ నాయకుడు శివప్రకాష్
….
శంకర్‌పల్లి: (సాక్షిత): శ్రీరామనవమి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్ ఇందిరానగర్ రామాలయంలో సీతారాముల కళ్యాణంలో శుక్రవారం బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు శివప్రకాష్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివప్రకాష్ కు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శివప్రకాష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. శివ ప్రకాష్ మాట్లాడుతూ శ్రీరాముడి దయతో కాలనీవాసులు సుఖ సంతోషాలతో, ఆనందంగా, చల్లగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్, రవి యాదవ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY