ప్రజలే నా బలం, వారి నమ్మకమే నా ప్రేరణ, ప్రజలతో పాటు నడుస్తూ సేవ చేయడమే నా ధ్యేయం – బి.ఆర్.ఎస్.ఎల్. పి. విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద.
ప్రజల సమస్యలే తన రాజకీయ దిశగా భావించే ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పేటబషీరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన రోజువారీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజల మనసులు గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అంశాన్ని ఓపికగా విని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు.
అదేవిధంగా, సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలను కూడా ప్రజల నుంచి స్వీకరించి, ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మరింత దగ్గరగా ఉండాలన్న తన సంకల్పాన్ని వెల్లడించారు.
“ప్రజలే నా బలం… వారి నమ్మకమే నా ప్రేరణ” అని పేర్కొన్న ఎమ్మెల్యే , నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలతో పాటు నడుస్తూ సేవ చేయడమే తన ధ్యేయమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంక్షేమ సంఘాల నాయకులు, సభ్యులు, వివిధ కాలనీ వాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY