మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మైనారిటీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ గా మహమ్మద్ ఉస్మాన్ నియమకం

Sakshitha news

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మైనారిటీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ గా మహమ్మద్ ఉస్మాన్ నియమకం ||

బాచుపల్లి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మైనారిటీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ గా మహమ్మద్ ఉస్మాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మహమ్మద్ ఉస్మాన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం హన్మంతన్న మహమ్మద్ ఉస్మాన్ ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, డీసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీ సయ్యద్ షఫీ, సీనియర్ నాయకులు సంపంగి వెంకటేష్ , పాషా భాయ్, సయ్యద్ ఆరిఫ్, ఎండీ నసీర్, ఎండీ అజీమ్, ఎండీ సల్మాన్, తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.