భక్తులకు మజ్జిగ, పానకం పంపిణీ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: శ్రీరామనవమి సందర్భంగా గోవిందధామం సభ్యులు వి.వెంకటేష్ ఆధ్వర్యంలో రిజర్వాయర్ రోడ్డులోని విజయా రెసిడెన్సి దగ్గర గల కుటుంబ సభ్యులతో, మిత్రబృందంతో కలసి సుమారు 1000 మందికి మజ్జిగ పంపిణీ, పానకము, వడ పప్పు పంపిణీ చేయడం జరిగింది.

ప్రతి సంవత్సరము శ్రీరామనవమి కార్యక్రమము దిగ్విజయంగా జరుపుతున్నాము. శ్రీరాముని ఆశీస్సులు తిరుపతి ప్రజలకు ఉండి అందరూ బాగుండాలని… అదేవిధంగా ప్రపంచమంతా శాంతితో ఉండాలని కోరుకుంటూ దీనికి ఉభయదారులు విజయ పాల కేంద్రం దిలీప్ యాదవ్ దంపతులు, చైతన్య బాబ్జి, చరిత దంపతులు, రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపి నాధరెడ్డి, ముని లక్ష్మీనారాయణ రెడ్డి, మునికృష్ణయ్య, ఎంఎంకె వాసు, సుబ్రమణ్య రెడ్డి, ఏవి నిరంజన్, కులశేఖర్, గోపి, దశరథ మిత్రులు పాల్గొనడం జరిగింది.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY