వేడుకగా శ్రీరామనవమి ఉత్సవాలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలోని పెద్దకాపు వీధిలో వెలసిన శ్రీరామ భజన మందిరంలో శ్రీరామ నవమి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉల్లాసంతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం సీతారాముల వారికి పురోహితులు సురేష్ స్వామి, ఆది గురుస్వామి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం నిర్వహించి, పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు వడపప్పు, పానకం వంటి పవిత్ర ప్రసాదాలను భక్తి భావంతో పంపిణీ చేశారు.
సాయంత్రం ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. 11 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవాల్లో తొమ్మిదవ రోజు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరగనుండగా, 11వ రోజు శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవంగా నిర్వహించబడనుంది. ప్రతిరోజూ సాయంత్రం నిర్వహించే ఊంజల్ సేవలో భక్తులు పాల్గొని స్వామి కృపను పొందాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉభయ దారులుగా సోమలపల్లి మునిరెడ్డి, జయ భారతి దంపతులు వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అండ్ బీజేపీ రాష్ట్ర నేత అయిన గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్ర, సోములపల్లి మునిరెడ్డి, జయ భారతి, రాహుల్ రెడ్డి, వెంకటముని రెడ్డి, మునిరాజమ్మ, గోపి, సుగుణ, స్వాతి, పావని, భవ్యసాచి, హన్సి, యశ్వంత్ రెడ్డి, రమణారెడ్డి, మాధవి, లక్కీ, పార్వతమ్మ, నాగమహేశ్వర్, వాసుదేవ రెడ్డి, శ్రావణి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, తులసి రామ్ నాయుడు, విజయభాస్కర్ రెడ్డి, ఎల్ కృష్ణయ్య, తిరుపాల ఆచారి, నరసింహారెడ్డి, కార్తీక్ రెడ్డి, చెంచమ్మ, వరలక్ష్మి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY