ఏ టి సి షార్ట్ టర్మ్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎం. ఎస్.రాజ్ ఠాగూర్
సాక్షిత పెద్దపల్లి / రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ రామగుండం ఏ టి సి గవర్నమెంట్ ఐటీఐలో నిర్వహించిన షార్ట్ టర్మ్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు మేయర్ మహంకాళి స్వామి పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని, ఇలాంటి షార్ట్ టర్మ్ కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే విద్య ద్వారా మాత్రమే యువత తమ లక్ష్యాలను సాధించగలరని, సమాజ అభివృద్ధికి కూడా వారు తోడ్పడగలరని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ఐటీఐ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

