కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ మరియు మహాదేవపురం ప్రాంతాలలో నిర్వహించిన శివాజీ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ….
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహరాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపన కోసం చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని, సమాజంలో న్యాయం, ధర్మం కోసం పోరాడిన మహనీయుడిగా ఆయనను స్మరించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు ప్రసాద్, మధుసూదన్, రఘు, సురేందర్, దేవరాజు, గంగారం, ప్రవీణ్, దిలీప్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు బుచ్చిరెడ్డి, మోట శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

