ఆహారం పోషణ ఆరోగ్యం నీరు మరియు పరిశుభ్రత కార్యక్రమం పై శిక్షణ
గర్భవతులకు, బాలింతలకు 1000 రోజుల పరిధి లోని పిల్లల తల్లులకి పోషకాలు అందించడం
నెల్లూరు జిల్లా కోవూరు మండలం వెలుగు కార్యాలయం నందు (ఎఫ్ ఎన్ హెచ్ డబ్ల్యు) కార్యక్రమం పై శిక్షణ ఏ పి ఎం వి. సుబ్బరాజు సమక్షంలో కార్యక్రమం జరిగింది పై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలో వి ఓ కి ముగ్గురు ఆరోగ్య సబ్ కమిటీ సభ్యులకు శిక్షణ కల్పించారు. న్యూట్రి గార్డెన్, పెరటి కోళ్ల పెంపకం చేపట్టి రక్తహీనతను పోగొట్టాలన్నారు.అలవాటులో మార్పు వచ్చేవరకు ఫాలో చేయాలి తల్లి పిల్లల పోషక పరిస్థితి అర్థం చేసుకొని అమలు చేయాలి, కార్యక్రమములో సి ఆర్ పి పాత్ర పై అవగాహన పెంపొందించుకొనుట మండలాల వారిగా కార్యక్రమ చర్య ప్రణాళిక తయారు చేయడం అలాగే గ్రామ నిరుపేదల శక్తి సామర్థ్యాలపై విశ్వాసం కలిగించాలి, నిరుపేదల పట్ల సానుభూతితో క్షేత్రస్థాయిలో పనిచేయాలి, చిత్ర శుద్ధితో పనిచేయాలి. నిజాయితీగా ఉండాలి, తెలిపారు. పై కార్యక్రమంలో అంగన్వాడి అధికారి శారద, సీసీలు మురళి, రాము, శోభ.సి ఆర్ పి లు తదితరులు ఉన్నారు

