అల్విన్ కాలనీ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు

Sakshitha news

అల్విన్ కాలనీ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా యువనేత మాట్లాడుతూ జరిగిన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం ఆనందించదగ్గ విషయం అని అన్నారు.

ముఖ్యమంత్రి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ విజయంతో అందరికి తెలిసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నా అని అన్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ మరియు అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషిచేసి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసారు. కార్యక్రమంలో గోపాల్, శివరాజ్ గౌడ్, గుడ్ల శ్రీనివాస్, పోశెట్టిగౌడ్, అగ్రవాసు, దాతి రమేష్, నిరంజన్, సూరిబాబు, నవాజ్, లింగం, సుధాకర్, నాగరాజు, మహేష్, ఖలీమ్, సుధాకర్, రవీందర్, హనుమంతు, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top