మొట్ట మొదటి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది…..

Sakshitha news

మొట్ట మొదటి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది…..

ఘనపూర్ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట, కడియం శ్రీహరి వెంటే ఉన్నారు……

మున్సిపాలిటీలో 70శాతానికి పైగా స్థానాలు గెలుచుకున్నాం…

ప్రతిపక్షాలకు ప్రజలు ఓటుతోనే బుద్ది చెప్పారు…..

ఇక నుండి ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోను….

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్తాం…..

నియోజకవర్గ అభివృద్దే ఏకైక ఎజెండా…..

100కోట్లతో ఘనపూర్ మున్సిపాలిటీ రూపు రేఖలు మార్చేస్తా…..

ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం…

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి…..

అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు….

ప్రతిపక్షాలకు స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ప్రజలు ఓటతోనే తగిన బుద్ది చెప్పారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

మొట్ట మొదటి స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికలలో భారీ విజయాన్ని నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు అంబరాన్ని అంటాయి. 18స్థానాలకు 13స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి విజయదుందుంబి మోగించింది. దింతో ఘనపూర్ మున్సిపాలిటీ జై కాంగ్రెస్ నినాదాలతో మారుమోగింది. గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సంబరాలతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. విజయం సాధించిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ…. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో 18వార్డులకు 13వార్డులలో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీతో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో 70శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో 72శాతం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని తెలిపారు. ఈ గెలుపుతో నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట, కడియం శ్రీహరి వెంటే ఉన్నారనే విషయం స్పష్టం అయిందని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, వ్యక్తిగత ఆరోపణలు చేసిన చేసినా మున్సిపాలిటీ ప్రజలు ఓటుతోనే తగిన బుద్ది చెప్పారని పేర్కొన్నారు. ఈ గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు.

ఇక నుండి ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోనని స్పష్టం చేశారు. నా ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి మాత్రమేనని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలా ముందుకు వెళ్ళానున్నట్లు వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. అందుకు నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యం కావాలని కోరారు. అవినీతి, అక్రమాలు లేని పాలన అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

స్టేషన్ ఘనపూర్ ను మున్సిపాలిటీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్లు మంజూరు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి ని ఒప్పించి మరో 50కోట్ల నిధులు మంజూరు చేపించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. రానున్న రెండేళ్లలో 100కోట్లతో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ రూపు రేఖలు మార్చేస్తానని స్పష్టం చేశారు. అలాగే ప్రతీ వార్డులో అభివృద్ధి పనులకు 2కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని తెలిపారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్దతో అడిగిన వేంటేనే నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఘనపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం విశేష కృషి చేసిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన మున్సిపాలిటీ ప్రజలకు, హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top