చందు నాగేశ్వరరావు నివాసంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Sakshitha news

చందు నాగేశ్వరరావు నివాసంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.. అనంతరం ఎన్నికల ప్రచారం
కోదాడ: మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చందు నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారి నివాసంలో అల్పాహారం స్వీకరించిన ఎమ్మెల్యే, అక్కడి నుంచే నేరుగా వార్డుల్లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహరచన చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Scroll to Top