హనుమకొండ: జూ పార్కులో తెల్ల పులి మృతి
హంటర్ రోడ్డులోని కాకతీయ జూ పార్కులో తెల్లపులి (15) మృతి చెందింది. వృద్ధాప్య సమస్యలతో పాటు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచినట్లు అటవీ శాఖాధికారి మయూరి వెల్లడించారు. సాధారణంగా పులుల ఆయుష్షు 14 ఏళ్లు కాగా, ఇది అంతకంటే ఎక్కువ కాలం జీవించిందని పేర్కొన్నారు. రెండు నెలలుగా వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. నిబంధనల ప్రకారం పోస్ట్మార్టం నిర్వహించి, ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు.

