ప్రైవేట్ టీచర్ల హక్కుల కోసం నామినేషన్ దాఖలు
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ నేడుహుజూర్ నగర్ పట్టణం లో 19వ వార్డు అభ్యర్థిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రైవేట్ విద్యా రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయుల గొంతుకను చట్టసభల్లో వినిపించేందుకు, వారికి అండగా నిలిచేందుకే ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ఈ సందర్భంగా గొట్టే నాగరాజు యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు చికాకుల శ్రీనివాసచారి, జిల్లా సహాయ కార్యదర్శి ఏ. విజయ్ కుమార్ పాల్గొని ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు, ప్రైవేట్ టీచర్ల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ టీచర్లు మాట్లాడుతూ నిరంతరం ప్రైవేట్ టీచర్ సమస్యల పై పోరాడుతున్న గొట్టే నాగరాజు యాదవ్ ను గెలిపించుకుంటామని అన్నారు.

