చిత్తరమ్మ తల్లి జాతర సందర్భంగా ఆలయంలో ఏర్పాటు

Sakshitha news

చిత్తరమ్మ తల్లి జాతర సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెడ్ కార్పోరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం లో వెలిసిన ప్రఖ్యాతగాంచిన శ్రీ చిత్తరమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ అనంతరం ఆలయ పూజారులు శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు, అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు …

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల చింతలని తీర్చే ఆ తల్లి శ్రీ చిత్తరమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు..

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు స్థానిక డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top