ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని సమ్మెను విజయవంతం

Sakshitha news

ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని – సిఐటియు మండల కార్యదర్శి రాథోడ్ సంతోష్ అన్నారు..

సిఐటియు బాచుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో బాచుపల్లి ఎమ్మార్వో ఆఫీస్ నుండి చౌరస్తా వరకు మున్సిపల్ కార్మికులతో ర్యాలీ నిర్వహించి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది…

గ్రేటర్ హైదరాబాద్ నిజాంపేట్ సర్కిల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు..

ఈ సందర్భంగా సిఐటియు బాచుపల్లి మండల కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ….కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం-2025, విబి జి-రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసిలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించాలని, కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికలు అందరూ 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బాచుపల్లి మండల కార్మికవర్గం మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు బాచుపల్లి మండలంలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు, ప్రజా సంఘాలు ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము,
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని నిరాయుధులను చేసి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు బంగారు పళ్ళెంలో పెట్టి బహుమానం ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడి ఇంతకాలం వాటిని అమలు చేయకుండా ఆపగలిగాము.

కానీ నేడు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుతో కార్పొరేట్ల ప్రయోజనాలు, వారి లాభాలు పెంచేందుకే 2025 నవంబర్ 21న లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల అమలుతో సంఘటిత, అసంఘటిత కార్మికులు, వారి కుటుంబాలు చితికిపొయ్యేలా, కార్పొరేట్లు లాభాలు ప్రోగేసుకోడానికి మార్గం సుగమం చేసింది. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని కార్మిక చట్టాలను నియంతృత్వ, దౌర్జన్యపూరితంగా కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని మార్చి వేసింది. ఇది రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే రాజ్యాంగ వ్యతిరేక చర్య. అంతర్జాతీయ కార్మిక సంస్థ “ఐఎల్ఓ” సిఫారసులను పూచిక పుల్లలా తీసి పారేశారు. బ్రిటీష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం-1926 ప్రకారం యూనియన్ల ఏర్పాటు కార్మికుల హక్కుగా పొందారు. కానీ ఈ లేబర్ కోడ్లతో కార్మికులు సంఘం పెట్టే హక్కు, సంఘటితమయ్యే హక్కు, నిరసనలు, సమ్మె చేసే హక్కులపై ఉక్కుపాదం మోపారు. ఉద్యోగ భద్రత పట్ల యాజమాన్యాలకున్న అన్ని బాధ్యతలను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకునేలా కార్మికవర్గం ప్రతిఘటనకు పూనుకోవాలని. లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని. సమ్మెతోనే పాలకవర్గానికి సమాధానం చెప్పాలని అన్నారు… ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ బాచుపల్లి మండల కోశాధికారి N.ఎల్లమ్మ, సభ్యులలు టి.శీను , కే లక్ష్మి, సిఐటియు నాయకులు ఎస్. బిక్షపతి, N. పోచమ్మ, S. పోచమ్మ,k. జగన్, శ్రీను,H. కళ, హనుమంతు, మౌనిక, నర్సింహ, దీపక్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top