టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో నేతాజీ జయంతి వేడుకలు

Sakshitha news

టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో నేతాజీ జయంతి వేడుకలు

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను సూర్యాపేట మండలం టేకుమట్ల ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ అమరుడు కొండేటి వేణుగోపాలరెడ్డి సేవాసమితి అధ్యక్షులు కుసుమసిద్ధారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుసుమసిద్ధారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, మంచి అలవాట్లు అలవర్చుకుని ఇష్టపడి చదువుకోవాలని సూచించారు. నేతాజీని స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి సేవ చేసే పౌరులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం నాగమణి, ఉపాధ్యాయులు మల్లికార్జున్, అప్సరబేగం, కేశవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రేణుక, ఉమ, ధనమ్మ, అగ్నేశా తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top