డ్రగ్స్ వద్దు బ్రో… బంగారు భవిష్యత్తుకు ఇదే మార్గం
మాదకద్రవ్యాలే యువతకు శత్రువు – అవగాహనతోనే రక్షణ
చెడు అలవాట్లకు చెక్… మంచి భవిష్యత్తుకు సంకల్పం
డ్రగ్స్ జోలికి వెళ్తే కలలు గల్లంతే
యువతే దేశ సంపద – డ్రగ్స్‌కు నో చెప్పాలి
విద్యార్థులు చెడు దారుల్లోకి వెళ్లకుండా సక్రమమైన మార్గంలో నడిచి తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే లక్ష్యంతో “సంకల్పం” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతిజ్ఞ చేయించారు
విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని నార్త్ స్టెప్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం మంగళగిరి పట్టణంలోని ఆత్మకూరు గ్రామంలోని వీ జె డిగ్రీ కళాశాలలో “డ్రగ్స్ వద్దు బ్రో” అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ విద్యార్థులు గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు మాత్రమే కాకుండా మద్యం జోలికి కూడా వెళ్లరాదని, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలు వారి బంగారు భవిష్యత్తును ఎలా నాశనం చేస్తాయో అధికారులు విపులంగా వివరించారు. డ్రగ్స్ అలవాటు వల్ల చదువు, ఆరోగ్యం, కుటుంబ జీవితం, సమాజంలో గుర్తింపు అన్నీ ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు.విద్యార్థులు చెడు దారుల్లోకి వెళ్లకుండా సక్రమమైన మార్గంలో నడిచి తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే లక్ష్యంతో “సంకల్పం” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, డ్రగ్స్‌కు సంబంధించిన ఏవైనా సమాచారం తెలిసిన వెంటనే 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా 112, 100 నంబర్లకు కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడొద్దు బ్రో” అనే నినాదంతో విద్యార్థులకు విస్తృతంగా సూచనలు, సలహాలు చేశారు. డ్రగ్స్ వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయని, ముఖ్యంగా యువత చదువుపై దృష్టి కోల్పోయి భవిష్యత్తును నాశనం చేసుకునే ప్రమాదం ఉందని అన్నారు. ఒకసారి మత్తు పదార్థాలకు బానిసలైతే వాటి నుంచి బయటపడటం కష్టమని, కుటుంబాలు–సమాజం మొత్తం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు..డ్రగ్స్ కారణంగా నేర ప్రవృత్తి పెరిగే అవకాశం ఉందని, చట్టపరంగా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే విద్యార్థులు చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సానుకూల కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు..యువతే దేశ భవిష్యత్తు అని, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం ద్వారా మాత్రమే సమాజానికి ఆదర్శంగా నిలవగలరని అన్నారు…. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.మంగళగిరి రూరల్ ఎస్సైలు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

