గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామం

Sakshitha news

గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామం నుండి పెడన నియోజకవర్గం గూడూరు మండలం నాగారం వరకు రూ.1.31 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము . భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పాల్గున్నారు..

ఏళ్లుగా అపరిస్కృతంగా ఉన్న రోడ్ల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేలకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత వైసిపి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా ఎక్కడా కనబడలేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…. నియోజకవర్గంలోని గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి 11కోట్ల పంచాయతీ నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాము పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ, గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు.

వైసిపి పాలనలో గ్రామాలు అంతులేని నిర్లక్ష్యానికి గురైతే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామాలు ప్రగతి పథంలోకి వెలుతు, రోడ్ల యొక్క రూపురేఖలు మారుతున్నాయన్నారు

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు, గ్రామస్తులు, తదితరులు పాల్గున్నారు..

Scroll to Top