అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి పూలే
సాక్షిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలె వర్ధంతి వేడుకలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పూలే చిత్రపటానికి పుష్పాంజలి అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలె వెనుకబడిన అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు.
సమాజంలో సమానత్వం విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఆశయంతో ఆయన చూపించిన మార్గం నేటి తరానికి ఎంతో ప్రేరణనిస్తుందని అన్నారు. గ్రామాల్లో విద్య మహిళా సాధికారత సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోవడం మనందరి బాధ్యత అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
