రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం
51 మంది లబ్ధిదారులకు సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు అందజేత
రూ.32 లక్షలు విలువగల చెక్కులు 51 మంది లబ్ధిదారులకు పంపిణీ
విజయవాడ : రాష్ట్రంలోని పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వారిని ఆదుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఎపిని అభివృద్ది పథం వైపు నడిపించటంతోపాటు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన రూ.32 లక్షలు విలువ గల చెక్కులను 51 మంది లబ్ధిదారులకు ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ లబ్దిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుగుసుకున్నారు.
సీఎంఆర్ఎఫ్ అందుకున్న 51 మంది లబ్ధిదారుల్లో తిరువూరు పట్టణానికి చెందిన వారు 8 మంది, విస్సన్నపేట మండలం కు చెందిన వారు 12 మంది, గంపలగూడెం మండలం కు చెందిన వారు 8 మంది, ఎ.కొండూరు మండలం కు చెందిన వారు 8 మంది, విజయవాడ కు చెందిన వారు 15 మంది వున్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో400 మందికి లబ్ధిదారులు రూ 3 కోట్ల 45 లక్షలు సీఎంఆర్ఎఫ్ సహాయం పొందారని ఎంపీ స్పష్టం చేశారు.
ఈ చెక్కులు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, కష్టకాలంలో కుటుంబాలకు కొత్త జీవితం అందించేందుకు అండగా నిలుస్తాయి. అనారోగ్య సమస్యలు, ఇతరత్రా అత్యవసరాల సమయంలో ప్రభుత్వ సహాయం ఎంతో పెద్ద తోడ్పాటు అవుతుందన్నారు. ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల కోసం ఎన్డీయే కూటమి నాయకులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎంపీ కేశినేని శివనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టిడిపి ఎన్టీఆర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా, టిడిపి ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్తి శ్రీనివాస చక్రవర్తి, టిడిపి నాయకులు వల్లభనేని నరసింహా చౌదరి, మాదిగాని గురునాథం, టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ (దళిత రత్న), విజయవాడ అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఇర్ఫాన్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

