టీఎన్.టీయూసీ అధ్యక్షునికి డాక్టరేట్ ప్రధానం

Sakshitha news

టీఎన్.టీయూసీ అధ్యక్షునికి డాక్టరేట్ ప్రధానం

** సత్కరించిన రాయల సీమ రంగస్థలి సభ్యులు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ కార్యదర్శి, టీఎన్.టీయూసీ
ప్రెసిడెంట్ కస్ప పద్మనాభం కు ఊటీలోని “యాక్టింగ్ అండ్ కల్చరల్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ” వాళ్ళు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు కస్ప పద్మనాభంను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కష్ప పద్మనాభం ప్రతి యేడాది తన సొంత ఖర్చులతో బహుభాష నాటకోత్సవా లను మూడు రోజులపాటు తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ కళా రంగానికి విశేష సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఆయన కళా సేవను గుర్తించిన పీస్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయడం తమకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు కేఎన్ రాజా, లోక ప్రభాకర్ నాయుడు, అరుణ్ రాయల్, బ్రహ్మానంద రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నా రెడ్డి రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, టిడిపి నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top