రైల్వే డివిజన్ సాధనలో తగ్గేదేలే….
** సాధన సమితికి పెరుగుతున్న రాజకీయ సంఘీభావం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి ప్రధాన కేంద్రంగా “బాలాజీ రైల్వే డివిజన్”ను సాధించడంలో ముందుగా రాజకీయ పార్టీల సంపూర్ణ సహకారం, మిగిలిన అన్ని వర్గాల ప్రోత్సాహంతో తగ్గేదేలే… అనేవిధంగా బాలాజి రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు ఊరకలేస్తూ పోరాటాన్ని వేగవంతం చేశారు. అందుకోసం రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ నేతృత్వంలో సభ్యులు సంఘీభావం కూడగట్టే పనుల్లో బిజీగా తిరుగుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అనేకమంది మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను నేరుగా కలసి రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతును కూడగట్టారు. తాజాగా టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బి.ఆర్) నాయుడును రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రం ఇచ్చారు. అందుకు చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ శుక్రవారం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడును కలవడం జరుగుతుందని… ఈ విషయాన్ని సీఎం
దృష్టికి తీసుకెళతానని తెలిపారు.
అలాగే తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్యను కలసి వినతిపత్రం ఇవ్వగా… తదుపరి కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదన పెట్టి తప్పక తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. మున్సిపల్ మేయర్ డాక్టర్ బి.ఆర్.శిరీష యాదవ్ ను కలసి వినతిపత్రం ఇచ్చారు. ఆమె స్పందిస్తూ తాను రైల్వే కుటుంబం నుంచి వచ్చానని….తాను హైస్కూల్ వరకు రైల్వే స్కూల్ లొనే చదివానని చెప్పారు. అధిక ఆదాయం వస్తున్న స్టేషన్లలో తిరుపతి ఒకటని, దూరప్రాంతాల నుంచి ప్రతి రోజు వేల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు, ఈ ప్రాంతం నేటికీ వెనుకబడి ఉన్నదని, కనీసం తిరుపతిని రైల్వే డివిజన్ చేయడం ద్వార మంచి హాస్పిటల్స్, స్కూల్స్, ప్లేగ్రౌండ్ లాంటి మరెన్నో ఉపయోగాలు ఉంటాయని పేర్కొన్నారు. అంతేగాక ఎందరికో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఈ ప్రాంతంలొ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
ఈ విషయాన్ని నెక్స్ట్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని సానుకూలంగా స్పందించారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని కూడా కలసి వినతిపత్రం ఇవ్వగా… ఆయన స్పందిస్తూ డివిజన్ వస్తే వాటి ఉపయోగాలు ఏమిటని అడిగి తెలుసుకొని ఈ విషయాన్ని ముందుగా సీఎం దృష్టికి తీసుకెళతా నని, అధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు. తనతో పాటు సమితి సభ్యులు కూడ సీఎంని కలసి వినతిపత్రం ఇవ్వండని దివాకర్ రెడ్డి కోరారు. నాప్రయత్నం పూర్తిగా చేస్తానని మరికొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంని కలసి రైల్వే డివిజన్ విషయంగా వినతిపత్రం ఇవ్వగా ఈ మధ్య మీరు చేస్తున్న కార్యక్రమాలు పత్రికల్లో చూస్తున్నట్లు చెప్పి… మంచి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరు కలసి ప్రయత్నం చేస్తే తప్పక తిరుపతికి రైల్వే డివిజన్ వచ్చే అవకాశం ఉందని తప్పక డివిజన్ సాధించవచ్చని సానుకూలంగా స్పందించారు. మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మను కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ నారాయణ దృష్టికి, అవకాశం ఉంటే మిమ్మలిని కూడ సీఎం దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని ఎల్లప్పుడు నా సహకారం మీకు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాధనసమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్, ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ఎం.వేణుగోపాల్ రెడ్డి,
సాధనసమితి
ప్రెసిడెంట్ వై.ఎస్.బాబు, సూరినేని బుజ్జి బాబు నాయుడు, చింతకాయల కృష్ణయ్య, అనిల్ కుమార్, నీలేష్, కుమార్, రాజు, నాగరాజు, టీ.వి.రావు పాల్గొన్నారు.

